Bhashyam Praveen : చంద్రబాబు సభతో పెదకూరపాడులో టీడీపీకి ఊపు..భాష్యం ప్రవీణ్ దే గెలుపు

Bhashyam Praveen

Bhashyam Praveen

Bhashyam Praveen : ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. సభకు అంచనాకు మించి జనం తరలివచ్చి టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు తిరుగులేదని నిరూపించారు. చంద్రబాబు సభతో వార్ వన్ సైడ్ అయ్యిందని స్థానికులు చెప్తున్నారు.

పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లను టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ దగ్గరుండి  పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. సభకు ముందు ఆయన మాట్లాడుతూ.. సభకు ఐదు మండలాల నుంచి దాదాపు 30 వేల మందికి పైగా ప్రజలు వచ్చి విజయవంతం చేయబోతున్నారన్నారు. ప్రజాగళం సభ కోసం టీడీపీ శ్రేణులు గత మూడు రోజులుగా అహర్నిషలు కృషి చేశారన్నారు. అధినేత సభ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీటింగ్ సక్సెస్ తోనే తాను ఘన విజయం సాధించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తన గెలుపు ఖాయమైందని, మరింత మెజార్టీ సాధించేందుకే తాము కష్టపడుతున్నామన్నారు. ఉమ్మడి గుంటూరులోనే పెదకూరపాడులో భారీ మెజార్టీ సాధించబోతున్నామన్నారు. టీడీపీ, జనసేన,బీజేపీ కూటమి ఏర్పాటుతోనే వైసీపీ పతనం ప్రారంభమైందని, తమ ప్రభుత్వం అత్యధిక స్థానాలు సాధించి చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నామన్నారు. తమ మ్యానిఫెస్టోలోని అంశాలకు ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు.

ప్రజాగళం సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను రామ రావణ యుద్ధంతో పోల్చారు. రావణాసురుడిని అంతం చేసే వరకు యుద్ధం ఆగదని అభివర్ణించారు. దోపిడీ, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు ఇలా రాష్ర్టంలో ప్రజలపై జరుగుతున్న దారుణాలతో విసిగి వేసారుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రజల కష్టాలు తీరుస్తామన్నారు. ముస్లింలపై కూడా దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై హత్యాకాండలు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల రిజర్వేషన్లు 4శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

బీజేపీతో కలిసి మంచి పాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇసుకాసురుడిని అంతం చేసే వరకు విశ్రమించేది లేదని అభిప్రాయపడ్డారు. గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్నారు. తెలుగు వారిని అమెరికా పంపించేందుకు కావాల్సిన సహాయం చేస్తామన్నారు. విజన్ ప్రకారం ముందుకెళ్తూ ప్రజలకు సేవ చేయడానికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యకు చరమగీతం పాడతామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ మేరకు పెదకూరపాడులో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే టీడీపీనే గెలిపించాలన్నారు. మన రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు తెలంగాణకు తరలిపోయాయని తెలిపారు.

భాష్యం ప్రవీణ్ కుమార్ సత్తా తనకు తెలుసన్నారు. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చామన్నారు. ఆయన గెలుపు ఖాయమన్నారు. ప్రజల సమస్యలను గుర్తించిన వారే నాయకులవుతారని, అందులో భాష్యం ప్రవీణ్ ముందున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వాన్ని కూల్చడంలో అందరు కలిసి వస్తారని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ గెలుపు ఆపడం ఎవరి కాదన్నారు.

ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా భాష్యం ప్రవీణ్ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేయడంతో నియోజకవర్గ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. పెదకూరపాడు ప్రజాగళం సభతో స్థానిక వైసీపీ నేతలు వణికిపోతున్నారు. ఎన్నికలకు ముందే వైసీపీ అభ్యర్థి ఓటమి ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. టీడీపీ సునామీలో వైసీపీ దారుణ పరాజయం తప్పదంటున్నారు.

TAGS