JAISW News Telugu

Chandrababu : 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఏర్పాట్లను చూస్తున్న రఘురామ కృష్ణం రాజు

Chandrababu

Chandrababu 

Chandrababu : ఏపీలో రికార్డు స్థాయి మెజారిటీ సాధించిన చంద్రబాబు నాయుడు ఎప్పుడు పాలనా పగ్గాలు చేపడతాడంటూ రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. దానికి మంచి ముహూర్తం కోసం సెర్చ్ చేసిన ఆయన 12 తేదీ (బుధవారం)గా నిర్ణయించారు. 12వ తేదీ సాయంత్రం 4.55 గంటలకు ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుగుదేశం పార్టీ నేత రఘురామ కృష్ణరాజు మీడియాకు తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారని, ఇది రాష్ట్ర ప్రజలకు అత్యంత గొప్ప విషయం అన్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రజా వ్యతిరేక పాలన తలుచుకుంటే ప్రజల వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు.

ప్రధాని మోడీ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా స్థానం ఉంటుందా? అని అడిగినప్పుడు, రఘురామ కృష్ణ రాజు మాట్లాడుతూ, ‘నేను అలా అనుకోవడం లేదు, ఎందుకంటే అది నా పరిధి లోనిది కాదు. మా పార్టీ నాయకుడు డిమాండ్ చేసే వ్యక్తి కాదు. మంచి సంబంధాలతో వీలైనంత రాబట్టుకోగలడని నేను అనుకుంటున్నా, అతను ఎప్పుడూ డిమాండ్ చేయడు.’ అని చంద్రబాబు తీరుపై కృష్ణం రాజు వివరించారు.

ఇదిలావుండగా, మోడీ దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) కు టీడీపీ మద్దతును ఆయన శుక్రవారం ధృవీకరించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, వికసిత్ భారత్ అనే దార్శనికతను ప్రస్తావిస్తూ ప్రధాని పదవికి మోడీ పేరును చంద్రబాబు ప్రతిపాదించారని, భారత్ మంచి అవకాశాన్ని ఎన్నడూ వదులుకోవద్దని కోరారు.

మరో సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, మోడీ విజన్ ఉన్న నాయకుడని, ఆయన అమలు చేసేవి పర్ఫెక్ట్ గా ఉంటాయన్నారు. ఈ రోజు, దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీనే అన్నారు. భారత్ కు ఇదొక మంచి అవకాశమని, ఇప్పుడు మిస్ అయితే ఎప్పటికీ మిస్ అవుతామని అన్నారు. ఇక్కడే మనకు అద్భుతమైన అవకాశం లభించిందని’ శుక్రవారం పార్లమెంటు భవనంలోని సంవిధన్ సదన్ లో జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో వెంకయ్యనాయుడు అన్నారు.

దివంగత మాజీ సీఎం, నటుడు ఎన్టీ రామారావు మానవతా దృక్పథాన్ని నరేంద్ర మోడీ విజన్ తో పోల్చారు వెంకయ్య నాయుడు. ఎన్డీయేతో టీడీపీకి మంచి సంబంధాలు ఉన్నాయని, తన నాయకుడు, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రజల కోసం కష్టపడ్డారని అన్నారు. ఆయన లాగానే నేడు మోడీ కూడా దేశం కోసం కష్టపడుతున్నారని అన్నారు. ఇది తన జీవితంలో గర్వించదగ్గ క్షణం అని వెంకయ్యనాయుడు అన్నారు.

ఈ వారం ప్రారంభంలో ఎన్డీయే పార్టీల నేతలు ప్రధాని మోడీని తమ నాయకుడిగా ఎన్నుకోవాలని తీర్మానించారు. జూన్ 9న మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

Exit mobile version