JAISW News Telugu

Jr NTR : చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఎన్టీఆర్ కు ఆహ్వానం!

FacebookXLinkedinWhatsapp
Jr NTR

Chandrababu Naidu – Jr NTR

Jr NTR : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఈ రోజు (జూన్ 12) సాయంత్రం అంగరంగ వైభవంగా జరగనుంది. చంద్రబాబు ఏపీ సీఎంగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ అపూర్వ, అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు ఏపీ మొత్తం ఆతృతగా ఎదురు చూస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందులో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా ఉండనున్నారు.

ఈ సారి మంత్రుల కూర్పులో బాబు చాకచక్యంగా వ్యవహరించారు. అటు కేంద్రానికి కూడా ఇద్దరు మంత్రులను రాష్ట్రం నుంచి ఇచ్చారు. ఇక రాష్ట్రంలో యంగ్ అండ్ డైనమిక్ పర్సన్స్ తో మహిళలను కూడా కేబినెట్ లోకి తీసుకున్నారు. వీరంతా ఈ రోజు చంద్రబాబు నాయుడితో కలిసి ప్రమాణ స్వీకరాం చేస్తారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి అపూర్వ ఘట్టానికి పొరుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు రానున్నారు. ఇక ఎన్డీయేలో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రానున్నారు.

ఇక నందమూరి ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే ఏపీ సీఎంగా బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ దిగ్గజాలకు ఆహ్వానం అందింది. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ తో సహా మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ను ఆహ్వానించినట్లు తెలిసింది. తమ్ముడి ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు చిరంజీవి ఇప్పటికే హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

వీఐపీలు, వీవీఐపీల విడిదికి, ఏపీ ప్రజలు ప్రమాణ స్వీకారాన్ని తిలకించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విజయవాడలో ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించి ప్రముఖులు వచ్చే రహదారుల్లో భద్రతను పెంచారు. ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లాంటి ప్రముఖ ప్రదేశాల్లో భద్రతను పెంచారు. బాబు ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరగనున్న నేపథ్యంలో ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Exit mobile version