Chandrababu : కొత్త జిల్లాలపై చంద్రబాబు దృష్టి

Chandrababu

Chandrababu

Chandrababu : కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పరిపాలన సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్త జిల్లాల్లో సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపట్టాలని, ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం మూడు హోటళ్లు ఉండేలా చూడాలని, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు అన్నారు.

TAGS