
Chandrababu Couple Visited Kolhapur Sri Mahalaxmi Temple
Chandrababu Couple : టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు, భువనేశ్వరి సాయినాథుడి దర్శనం కోసం షిరిడీ పయనమయ్యారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గత ఏడాది స్కిల్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన విడుదల అనంరం తరచుగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత రాజకీయ కార్యకలాపాలతో ముమ్మరంగా గడిపిన చంద్రబాబు, పోలింగ్ పూర్తయ్యాక మళ్లీ పుణ్యక్షేత్రాల బాటపట్టారు.