Chandrababu Birthday :చంద్రబాబు బర్త్ డే.. అన్నాదమ్ముళ్ల ఆసక్తికర ట్వీట్లు

Chandrababu Birthday

Chandrababu Birthday

Chandrababu Birthday : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు. ఆయన జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. కుప్పంలో నారా భువనేశ్వరి సమక్షంలో బాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబుకు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు ప్రేక్షకులను అలరించాయి. అహర్నిశలు పార్టీ కోసం పాటుపడే బాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. పార్టీకి మార్గనిర్దేశం చేస్తూ నిత్యం ప్రజలతో మమేకం అయ్యే బాబు ఆరోగ్యంగా ఉంటే ఇంకా కొన్నేళ్లు పార్టీకి జవసత్వాలు నింపుతారని అభిప్రాయపడ్డారు.

రాజకీయంగా, పాలనాపరంగా అనుభవజ్ణుడైన చంద్రబాబు నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తారు. పార్టీ డెవలప్ మెంట్ కే ప్రాధాన్యం ఇస్తుంటారు. బాబుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినప్పుడు కూడా ఆయన భయపడలేదు. మనోధైర్యంతో ముందడుగు వేశారని కీర్తించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ బాబు గురించి ఎక్స్ వేదికగా పలు ట్వీట్లు చేశారు.

చంద్రబాబు విజన్ రాష్ట్రానికి ఎంతో అవసరం. ప్రజల మేలు కోసం ఆలోచించే నాయకుడిగా బాబు నిరంతరం శ్రమిస్తుంటారు. ఆయన ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఆ దిశగా ఆయనకు ఆరోగ్యం సహకరించాలని అందరు ఆశిస్తున్నారు. బాబు పది కాలాలపాటు ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలని కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ కోసం బాబు పాటుపడతారన్నారు. భవిష్యత్ లో ఏపీ సుభిక్షంగా ఉండాలంటే ఆయన పాలన అవసరమే. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు కట్టుబడి ఉంటారు. అందుకే ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఈ సందర్భంగా పలువురు కోరడం జరిగింది.

TAGS