Chandrababu Bail : ఆ రోజే చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ..‘స్కిల్’ కేసు లేటెస్ట్ అప్ డేట్!

Chandrababu bail cancellation investigation

Chandrababu bail cancellation investigation

Chandrababu Bail : ఏపీలో ఎన్నికల రాజకీయం వేడుక్కుతోంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కేసులో 53 రోజుల రిమాండ్ ఎదుర్కొన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హై కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు.

చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ సీఐడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు దేశం విడిచి వెళ్లడంలో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ ఆరోపించింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ లో వివరించింది. హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించడంతో పాటు, వాస్తవాలను పరిగణలోకి తీసుకోవడంలో పూర్తిగా పొరబడిందని పేర్కొంది. తీర్పులో పేర్కొన్న అంశాలన్నీ రికార్డులు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది.

స్కిల్ కేసులో చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నాడని బెయిల్ మంజూరు చేయవద్దని  ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు తీర్పులో పేర్కొన్న అంశాలన్నీ రికార్డులకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఈ పిటీషన్ పై సుప్రీం విచారణకు స్వీకరించింది. ఈ సమయంలో  చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు. దీంతో ఫిబ్రవరి 12వ తేదీకి కేసును వాయిదా వేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. తాజాగా స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ లో 17ఏ అంశంపై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రిమాండ్, ఎఫ్ఐఆర్ గురించి ఎక్కడా న్యాయస్థానం అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. సీజేఐకి కేసు రెఫర్ చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఈ కేసు విచారణపై ప్రత్యేకంగా బెంచ్ కు రెఫర్ చేయాల్సి ఉంటుంది. బెంచ్ ఖరారు అయిన తర్వాత ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించడంతో పాటుగా 17ఏ పై వాదనలు వినే అవకాశం ఉంది. 5గురు సభ్యుల ధర్మాసనానికి ఈ కేసు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్కడ విచారణ తర్వాత 17ఏ అంశంపై సుప్రీంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం స్కిల్ కేసులో బెయిల్ పై ఉన్న చంద్రబాబుపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై ఫిబ్రవరి 12న విచారణ జరుగనుంది.

TAGS