Chandrababu Fan : చంద్రబాబు సీఎం కావాలని.. నాలుక కోసుకున్న వ్యక్తి

Chandrababu Fan
Chandrababu Fan : సినిమా హీరోలకు వీరాభిమానులు ఉన్నట్లే రాజకీయ నాయకులను అభిమానించే వ్యక్తులూ ఉంటారు. తమ నాయకుల కోసం వాళ్లు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తమకు వారి నుంచి ఏ సహాయం అందకపోయినా సరే.. వారి అభిమాన నేతల తరపున ప్రచారం చేయడానికి ముందుంటారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అభిమాని ఒకరు చేసిన పని రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీకి చంద్రబాబు సీఎం కావాలని ఒక వ్యక్తి తన నాలుకని కోసుకున్నాడు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
అతడు పశ్చిమ గోదావరి జిల్లా గుటల గ్రామానికి చెందిన మహేశ్ గా పోలీసులు గుర్తించారు. అతడి వద్ద లభించిన లేఖలో ‘‘నాపేరు చేపల మహేశ్. మాది పశ్చిమ గోదావరి జిల్లా గూటల గ్రామం. నేను గతంలో వైఎస్ఆర్, జగన్ సీఎం కావాలని ఇక్కడే నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నా. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావాలని, పవన్, లోకేశ్ గెలవాలని నాలుక కోసుకున్నా’’ అని రాశాడు.