
Chandrababu Couple Visited shirdi
Chandrababu : ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అప్పటిదాక వ్యూహాలు, ప్రతివ్యూహాలు, మండుటెండల్లో ప్రచారంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు కాస్త సేద తీరుతున్నారు. ఇవాళ మహారాష్ట్ర షిరిడిలోని సాయినాథుడిని సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శించుకున్నారు. తెలుగు ప్రజలందరికీ ఐష్టఐశ్వర్యాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సాయినాథుడిని ప్రార్థించానని ఆయన ట్విటర్ లో ఆ ఫొటోలను షేర్ చేశారు.
ప్రసిద్ధ షిరిడి క్షేత్రంలో శ్రీ సాయిబాబా దర్శనం చేసుకున్నాను. తెలుగు ప్రజలందరికీ ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ సాయినాథుని వేడుకున్నాను. pic.twitter.com/61g6Xr4xFu
— N Chandrababu Naidu (@ncbn) May 16, 2024
షిరిడిలో సాయిబాబా దర్శనం తర్వాత అక్కడే ఉన్న వృద్ధాశ్రమాన్ని సతీసమేతంగా సందర్శించారు. అక్కడ ఉన్న వృద్ధులను బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ కొందరు తెలుగు వాళ్లతో చంద్రబాబు మాట్లాడారు.