Chandrababu Song : ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కన్నీరు పెట్టిస్తున్న పాట!!
Chandrababu Song : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ మేరకు పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు పలువురు సెలబ్రిటీలను కూడా వినియోగించుకుంటోంది. ప్రస్తుతం జనాల నాడీని బట్టి రాష్ట్రంలో టీడీపీ కూటమే అధికారంలోకి రాబోతోందనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రచారంతో ప్రజల్లో కూటమికి అనుకూలమైన వేవ్ కనపడుతోంది. ఐదేళ్లలో వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అలాగే ఉద్యోగ, ఉపాధి, రాజధాని విషయమై యువత జగన్ పార్టీపై కన్నెర్ర చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు సోషల్ మీడియా, యాడ్స్, పాటల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాయి. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసంపై, చంద్రబాబు పాలనలో జరిగిన మంచి పనులపై టీడీపీ కూటమి పాటల ద్వారా ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎన్నో పాటలు జనాలను ఉర్రూతలూగిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలను ప్రశ్నిస్తున్నాయి. జగన్ పాలనలో జరిగిన నష్టాలను సగటు ఓటరు కూడా అర్థమయ్యేలా పాటలు ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా చంద్రబాబు పాలనపై ఓ అద్భుత పాటను రిలీజ్ చేశారు. ‘‘ఒక్కసారి నిన్ను కాదనుకున్నందుకేగా.. ఎన్ని కష్టాలు, కన్నీళ్లు చూశాం..’’ అంటూ సాగే పాట అందరినీ ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తోంది. ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబే జవాబు అంటూ సాగుతుంది పాట. ‘‘నువ్వు మాతో ఉంటే చాలు చంద్రబాబు..’’ అంటూ ఎమోషనల్ గా సాగుతున్న పాట కన్నీళ్లను తెప్పిస్తోంది. చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడాలను స్పష్టంగా వివరించింది ఈ పాట. ఈ పాట విన్న వారు కచ్చితంగా ఎమోషనల్ అవుతారని చెప్పవచ్చు.
కాగా, చంద్రబాబు దాదాపు 70 ఏండ్ల వయసులో కూడా చురుకుగా ప్రచారంలో పాల్గొంటుండడం టీడీపీ క్యాడర్ లో జోష్ ను పెంచుతోంది. కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని, సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కూటమి జనాల్లో సానుకూల స్పందన వస్తోంది. ఈసారి చంద్రబాబును సీఎంగా చేయాలని జనాలు ఫిక్స్ అయినట్టు కనపడుతోంది. ఆయన సీఎం అయితేనే గత ఐదేండ్లలో విధ్వంసమైన ఏపీని చక్కదిద్దగలరని వారు నమ్ముతున్నారు.