
Prajagalam, Bhasyam Praveen
Prajagalam : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా గళం బహిరంగ సభ పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం కేంద్రంలో 6 తారీకు ప్రారంభం కాబోతోందనీ పెదకూరపాడు టిడిపి ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రజాగళం సభ ప్రారంభమవుతుందని ప్రవీణ్ తెలిపారు. కావున తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని ప్రజా గళం సభను విజయవంతం చేయాలని భాష్యం ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి ప్రజలు భారీ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రజా గళం సభకు హాజరవుతున్నారని భాష్యం ప్రవీణ్ తెలిపారు. మొదటిసారి ఎన్నికల ప్రచారానికి వస్తున్న చంద్రబాబు నాయుడుకు పెదకూరపాడు నియోజకవర్గ అంతా కూడా ఘన స్వాగతం పలుకుతుందని ఆయన తెలిపారు.