Chandrababu : అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. తాజాగా హోంమంత్రి అనితపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. ఏపీలో శాంతి భద్రతలపై ప్రశ్నిస్తూ.. హోంమంత్రి సమీక్షించాలంటూ జనం మధ్యలో పవన్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, పోలీసుల తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే మంద కృష్ణ మాదిగ కూడా పవన్ కళ్యాణ్ పై పలు వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో సీఎంతో పవన్, అనిత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. హోంమంత్రి పదవి తనకే వస్తుందని పవన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు నాయుడు వద్ద ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వారిద్దరినీ సమావేశపరిచారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, అత్యాచార ఘటనలపై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హోంమంత్రి బాధ్యత వహించాలని, అవసరమైతే తానే ఆ బాధ్యతలు చేపడతానని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సైతం పవన్ భేటీ అయ్యారు.