Chandrababu : వైఎస్ జగన్ ఏపీని ఐదేళ్లు పాలించారు. ‘విశాఖ రాజధాని’ అయితేనే ఉత్తరాంధ్ర జిల్లాలు డెవలప్ అవుతాయని కబుర్లు చెప్తూ కాలం గడుపుతున్నారే తప్ప విశాఖ అభివృద్ధికి చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. కానీ బాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెలకే విశాఖ నగరానికి వచ్చి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ నగరం, ఉత్తరాంధ్ర జిల్లాల డెవలప్ పై సమీక్షలు నిర్వహించారు.
జగన్‌కు విశాఖను రాజధానిగా చేయాలనే చిత్తశుద్ధి ఉండి ఉంటే రోడ్ల విస్తరణ, కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేసి ఉండాలి. కానీ రుషికొండను ధ్వంసం చేసి రూ.500 కోట్లతో విలాసవంతమైన భవనాలను నిర్మించుకున్నారు. చంద్రబాబు మొదటి పర్యటనలోనే విశాఖలోని 12 ప్రధాన జంక్షన్లలో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విశాఖను ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చాలని, విశాఖకు అందమైన సముద్రతీరం కూడా ఉంది. కాబట్టి మరింత పర్యటకం పెరుగుతుంది. ఈ విషయాలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
కానీ చంద్రబాబు నిన్న (జూలై 11) తొలి సమావేశంలో విశాఖ నుంచి భోగాపురం మీదుగా శ్రీకాకుళం వరకు ‘బీచ్ కారిడార్’ డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలు తన ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు కనుక వేగంగా పనులు పూర్తి చేయాలని అనుకుంటున్నాం కాబట్టి అధికారులు కూడా ఆ వేగానికి తగ్గట్లుగా దూసుకుపోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
అధికారులు తమ పనితనం, సామర్థ్యం నిరూపించుకునేందుకు మంచి అవకాశమని, ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలని అధికారులకు సూచించారు. జగన్మోహన్ రెడ్డిలాగా చంద్రబాబు విశాఖను రాజధానిని చేస్తామని చెప్పలేదు. కానీ నెల గడవకముందే విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి పనులను మొదలుపెట్టారు.
జగన్ దిగిపోయే ముందు భోగాపురం విమానాశ్రయం, భావనపాడు తదితర పోర్టుల పనులకు శంకుస్థాపన చేశారు. జగన్ మొదలుపెట్టిన పనులను బాబు పక్కన పెట్టేయలేదు. వాటి పురోగతిని పరిశీలించి వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ వద్ద 23 మంది ఎంపీలు ఉన్నా స్టీల్ ప్లాంట్ కాపాడుకునే ప్రయత్నాలు చేయలేదు. కానీ చంద్రబాబు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో మాట్లాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పర్యటనకు రప్పించి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబు నెల రోజుల పాలన ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టేలా సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది. కానీ జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించడమే తప్ప ‘మేలు’ చేసింది కనిపించడం లేదు.