Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల్లో ప్రచారం ముమ్మరం అయింది. గెలపు కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఒక వైపు, వైసీపీ మరోవైపు ప్రచారం కొనసాగిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఏ పథకాలు తీసుకొస్తామో చెబుతున్నాయి. తమ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ వ్యవహారం మరోమారు చర్చనీయాంశంగా మారింది. వలంటీర్ల పేరు చెప్పి సంక్షేమ పథకాలను ఆపుతున్నారని, వృద్ధులను, మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ కూటమిపై వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే పింఛన్లకు తాము వ్యతిరేకం కాదని, సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయాలో తమకు క్లారిటీ ఉందని చంద్రబాబు చెబుతూనే వస్తున్నారు.
వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయడాన్ని ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆపాలని లేఖ రాసిన నేపథ్యంలో పింఛన్ల పంపిణీ అసెంబ్లీ, లోక్ సభ ప్రవర్తన నియమావళికి విరుద్ధమని పేర్కొనడంతో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో పింఛన్ల పంపిణీ నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో అసెంబ్లీ వేదికగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలిస్తే టీడీపీ పింఛన్లు రూ. 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అవి కూడా ఇంటికే వచ్చి ఇస్తామని తెలిపింది. దీంతో టీడీపీ హామీని ప్రజలు విశ్వసించే ఆలోచనలోనే ఉన్నారని తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ వ్యవహారంలో టీడీపీ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. పింఛన్ ఇంటికే పంపిస్తామని చెప్పడంతో ఓటర్లలో ధీమా వ్యక్తమవుతోంది.
రెండు మూడు నెలలు పింఛన్ తీసుకోకపోయినా మొత్తం ఒకేసారి చెల్లిస్తామని స్పష్టం చేసింది. వలంటీర్ల వ్యవస్థపై స్పష్టత ఉందని చెబుతోంది. వారి భవిష్యత్ కు ఎలాంటి ఢోకా ఉండదని అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశిస్తోంది. దీని కోసమే టీడీపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని చెబుతోంది. ప్రజలు తమపై నమ్మకం ఉంచాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరో రెండు, మూడు నెలలు ప్రజలు ఓపిక పట్టాలని, ఆ తర్వాత ప్రజలు కోరినట్టుగా పాలన అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు.