Chandrababu : ‘మహా’ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు హర్షం.. అమిత్ షాకు ఫోన్
Chandrababu : ‘మహా’ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ‘మహాయుతి కూటమి’ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయితే ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న మహాయుతి కూటమికి సీఎం శుభాకాంక్షలు తెలిపారుజ ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. ‘ఎన్నికల్లో ప్రజలు అపూర్వ విజయం కట్టబెడుతున్నారని శుభాకాంక్షలు చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయం దిశగా వెళుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ఆ కూటమి 227 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంవీఏ కూటమి కేవలం 53 స్థానాల్లోనే ముందంజలో ఉంది. మహాయుతి కూటమి అధికారంలోకి రావడం ఖాయం’ అంటూ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.