Chandrababu : ట్రైన్ యాక్సిడెంట్ నుంచి తృటిలో తప్పించుకున్న చంద్రబాబు నాయుడు..

Chandrababu

Chandrababu

ఆంధ్రప్రదేశ్ ను వరదలు చుట్టు ముట్టినప్పటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. వర్షం, లోతట్టు ప్రాంతాలు, నాలాలు, మ్యాన్ హోల్స్ లాంటివి పట్టించుకోకుండా ప్రమాదాలు పొంచి ఉన్నాయని తెలిసినా పట్టించుకోకుండా పర్యటన చేస్తున్నారు. రాష్ట్రం వరదలతో అల్లాడుతుందని కేంద్రం సాయం చేయాలని ఇప్పటికే అభ్యర్థించాడు. కేంద్రం కూడా ఈ మేరకు నష్ట పరిహార సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయోనని తెలుసుకుంటున్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ప్రాణాలను పనంగా పెట్టిమరీ పర్యటిస్తున్నారు. ఇటీవల ఆయన ట్రైన్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు.

చంద్రబాబు నాయుడు తృటిలో రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా మధురా నగర్ రైల్వే బ్రిడ్జి మీదుగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సీఎం, భద్రతా సిబ్బందిని తాకకుండా రైలు వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీని పీటీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. వరద నష్టాన్ని సమీక్షించేందుకు చంద్రబాబు ట్రాక్‌ వెంబడి నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా అదే ట్రాక్‌పై రైలు వచ్చింది. రైలు రాకపోకల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వంతెనలో పాదచారులకు స్థలం లేదు. అకస్మాత్తుగా భద్రతా సిబ్బంది అతన్ని సురక్షితంగా పక్కకు తీసుకెళ్లారు. పెను ప్రమాదం తప్పింది.

భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలు జలమయమై జనజీవనం అతలాకుతలమైంది. చంద్రబాబు నాయుడు ఐదు రోజులుగా విపత్తు ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అతను ఎన్‌డీఆర్‌ఎఫ్ బోట్లలో రక్షకులతో కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, సేఫ్టీ ప్రొటోకాల్స్ దాటవేసి, ఆనకట్ట గుండా తిరుగుతున్నాడు. ఇంతలో ఈ ఘటన జరిగింది.

TAGS