Chandrababu : చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం.. బాబు హెలీకాప్టర్ పైలట్ ఏం చేశాడంటే?

Chandrababu : ఏపీకి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వివిధ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన సభలు, సమావేశాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆయన ఈ రోజు (జనవరి 20) పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాణాపాయం కలుగుతుందని అంతా భావించారు. కానీ ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బయటపడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. చంద్రబాబు నాయుడు వైజాగ్ నుంచి హెలీకాప్టర్‌లో అరకు వెళ్తున్నారు. వాహనం రాంగ్ రూట్‌లో వెళ్లినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) గుర్తించింది. వెంటనే సదరు అధికారులు పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో వేగంగా స్పందించిన పైలట్ సరైన మార్గంలో హెలీకాప్టర్ ను తిప్పాడు. చివరకు ఆయన వెళ్లాలనుకున్న అరకులో సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

చంద్రబాబు నాయుడు అరకులోని ‘రా.. కదలిరా’ సభ నిర్వహించాల్సి ఉంది. ఇందుకు మాజీ సీఎం హెలీకాప్టర్‌ లో వెళ్లాలనుకున్నారు. నిబంధనల ప్రకారం, ATC మ్యాప్‌ను ఆమోదించాలి, వారు చూపిన మార్గాన్ని అనుసరించాలి. కానీ పైలట్ ఎక్కడో తప్పాడు. దీంతో ATC ఆ మార్గం తప్పుగా ఉందని గుర్తించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పైలట్‌ను హెచ్చరించింది. రాంగ్ రూట్‌లో వెళ్లిన కొద్ది సేపటికే ఛాపర్ మార్గం సరిచేసింది ATC. దీంతో ఛాపర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

TAGS