CM Chandrababu : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక గురువారం తొలిసారి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
గడచిన 5 ఏళ్లలో కొందరు అధికారుల తీరు చాలా బాధించిందని వ్యాఖ్యానించారే. అలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. తాను గతంలో పలుమార్లు సీఎంగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో తాము వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని వ్యాఖ్యానించారు. అలాగే మరోసారి శాఖల వారీగా ఐఏఎస్, ఐపీఎస్ లతో సమావేశం అవుతానని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు ప్రవీణ్ ప్రకాష్, శ్రీ లక్ష్మీ, పిఎస్ఆర్ ఆంజనేయులు పుష్పగుచ్చాలను అందించేందుకు యత్నించగా సీఎం చంద్రబాబు తిరస్కరించారు.