Chandrababu : ఏపీలో కూటమి ఘన విజయంతో మరోసారి చంద్రబాబు టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారారు. ఇక దేశంలోనైతే ఎక్కడ చూసినా ఆయన గురించే. టాక్ ఆఫ్ ది వరల్డ్ అని ఎందుకంటున్నామంటే..చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసినప్పుడే ఆయన దేశవిదేశాల్లో తన పాలనా విధానాలతో అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబు ఒక దార్శనికుడైన పాలకుడే కాదు మంచి ఆర్థిక వేత్త, సంస్కరణకర్త, అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర నిర్మాత కూడా. అందుకే ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు.
మిగతా నాయకుల్లాగా ఆయన ఎప్పుడూ తిట్ల రాజకీయాలు చేయలేదు. ప్రతిపక్ష నేతలపై కుట్రలు పన్నలేదు. జైళ్లకు పంపలేదు. ఆయనకు తెలిసింది రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో ఎలా నిలబెట్టడం.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, కొత్త సంస్కరణలు తీసుకురావడం, అవినీతి రహిత, మెరుగైన, నాణ్యమైన పాలన అందించడం అందుకే దేశంలోని పాలకుల్లో ఎవరికీ లేని ప్రత్యేకత ఆయనకే సొంతం.
ఉమ్మడి ఏపీ సాఫ్ట్ వేర్ రంగంలోనూ, ఫార్మా, ఇతర పారిశ్రామిక రంగాల్లోనూ, హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన..ఇవన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగింది. అప్పటిదాక మూస పద్ధతిలో సాగిన పాలన..చంద్రబాబు చేతిలోకి వచ్చేసరికి ఆధునిక రూపు సంతరించుకుంది. అందుకే నేటి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా, వివిధ రంగాల్లో అగ్రస్థానం అందుకుంటూ దేశ విదేశీ రంగాల్లో సత్తాచాటుతున్నారు.
చంద్రబాబు చేసిన సేవలకు ఏకంగా పలు ప్రపంచ స్థాయి సంస్థలు ఆయన్ను గౌరవించాయి. ప్రపంచ సంస్థల నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరం(వరల్డ్ ఎకనామిక్ ఫోరం) ప్రపంచంలోని మేధావులను జల్లెడ పట్టి ఎవరైతే ఈ ప్రపంచాన్ని బాగు చేయగలరో..వారికి అధికారాన్ని ఇస్తే అభివృద్ధి చెందుతుందో అని 180 దేశాల్లో నుంచి వెతికారు. ప్రపంచ డ్రీమ్ కేబినెట్ పేరుతో ఎంపిక చేసిన ఈ లిస్ట్ లో మొత్తం 14 మందిని తీసుకున్నారు. అందులో మన చంద్రబాబు నాయుడు కూడా విశేషం. ఇదీ చంద్రబాబు స్థాయి..కానీ మన మూస రాజకీయ నాయకులు ఆయన రేంజ్ అర్థం కాదు. 2019లో చంద్రబాబు రెండో సారి సీఎం అయితే ఇప్పటికే అమరావతి ప్రపంచ పటంలో స్థానం పొందేది. అలాగే పోలవరం పూర్తయ్యేది.. విభజనతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని నవ్యపథం వైపు నడిపించేవారు. కానీ అధికారం చేపట్టిన జగన్ రాష్ట్రాన్ని మరింత దౌర్భాగ్య స్థితికి తెచ్చారు. త్వరలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తాడని నమ్మకం అందరిలోనూ కలుగుతోంది.