Chandrababu : ఏపీకి గుడ్ న్యూస్ తేబోతున్న చంద్రబాబు.. ప్రత్యేక హోదాపై క్లారిటీ!

Chandrababu

Chandrababu and Modi

Chandrababu : ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే టీడీపీ ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు తేబోతోంది. 16 ఎంపీ సీట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్నారని తెలిసిందే. అయితే ఏపీ డెవలప్ మెంట్ కోసం కూడా గొంతెమ్మ కోరికలను ఎన్డీయే ముందు ఉంచబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు కోరికలను అన్నింటినీ కాకుండా కొన్నింటిని ఆలోచిస్తామని ఎన్డీయే కూడా హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటగానే ఉండేవి. ఆచరణకు నోచుకోకపోయేవి. కానీ మోడీ హయాంలో అలా కాదు. ఆయన ఒక మాట అన్నాడంటే దానికి ఎక్కువగానే చేస్తారు కానీ తక్కువ ఉండదని, దేశంలోని ప్రధాన పార్టీలకు తెలుసు. ఆయన గురించి తెలిసిన చంద్రబాబు నాయుడు స్పీకర్ పోస్ట్, ఒక కేబినెట్, రెండు సహాయక మంత్రుల పదవులు కావాలని కోరుతున్నారు. అయితే అందులో అన్నింటికీ కాకుండా కొన్నింటికి మాత్రమే మోడీ హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ కొన్ని హామీలను ఇచ్చింది. ఈ హామీలకు అనుగుణంగా ఎన్డీయే ప్రభుత్వం కూడా ఏపీకి నిధులను పెంచుతూ వెళ్లింది. కానీ ఏపీకి స్పెషల్ స్టేషన్ కావాలని చంద్రబాబు మొదటి ముఖ్యమంత్రిగా పని చేసినప్పటి నుంచి కేంద్రాన్ని కోరుతూ వస్తున్నాడు. కానీ కేంద్రం స్టేట్ సపరేషన్ బిల్లులో ఈ అంశం లేదని చెప్తూ వస్తోంది.

జగన్ పాలనలో అప్పుల కుప్పగా మారిన ఏపీని ఆదుకునేందుకు స్పెషల్ స్టేషన్ ఇవ్వాలని చంద్రబాబు మరోసారి మోడీ ముందుకు ఈ అంశాన్ని తీసుకువచ్చారు. అయితే ఎన్డీయే ప్రభుత్వం దీనికి అంగీకరించినట్లు సూచన ప్రాయంగా తెలిపింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ లో ఈ అంశాన్ని పెడతామని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే, ఏపీకి కొత్త ప్రభుత్వంలో మొదటి భారీ శుభవార్తగా దీన్నే చెప్పుకోవచ్చు అంటున్నారు.

TAGS