Sajjala Ramakrishna : తెలంగాణలో వైఎస్సార్ టీపీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీని కాంగ్రెస్ లో కలిపింది వైఎస్ షర్మిల. దీంతో పార్టీ ఆమెకు ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. షర్మిల కాంగ్రెస్ లో కలవడంపై ఆయా పార్టీల నాయకులు వారిని నచ్చిన విధంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా సజ్జల ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి హస్తం ఉందని, తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం చేసిన బహిరంగ ఆరోపణ. చంద్రబాబు తన రాజకీయ లబ్ది కోసం కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని జగన్ స్వయంగా మొన్న చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.
చంద్రబాబు నాయుడుకు ఏదైనా చేయగల సత్తా ఉందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంలో కూడా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో చేతులు కలపడంతో అనేక అనుమానాలు లేవనెత్తాం. కాంగ్రెస్ నాయకత్వంతో ఆయన ఎప్పుడూ టచ్ లో ఉన్నారని సజ్జల తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై జగన్ పై తప్పుడు కేసులు బనాయించింది చంద్రబాబునాయుడేనని ఆయన అన్నారు.
కుట్రలో ప్రత్యక్షంగా ప్రమేయం లేకుండా పనులు ఎలా చేయాలో ఆయనకు తెలుసు. అదే కుట్రతోనే షర్మిలను కాంగ్రెసులో చేర్చుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి అన్నారు. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల వైసీపీపై పెద్దగా ప్రభావం ఉండదని సజ్జల అన్నారు.
‘మాకు ఎలాంటి నష్టం లేదు. తనకు నచ్చిన నియోజకవర్గం నుంచి పోటీ చేసుకోవచ్చు. ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించే స్వేచ్ఛ ఆమెకు ఉందని, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తన ఔచిత్యాన్ని కోల్పోయింది’ అని ఆయన అన్నారు.