Borugadda Anil : రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ ను పోలీసులు పీటీ వారెంట్ పై కర్నూలుకు తీసుకువచ్చారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూల్ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో ఆయనను పీటీ వారెంట్ పై కర్నూలుకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. బోరుగడ్ అనిల్ పై పలు కేసులున్నాయి. రూ.50 లక్షలు ఇవ్వాలంటూ 2021లో కర్లపూడి బాబుప్రకాశ్ ను బెదిరించిన కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నారు. గత ఏడాది మార్చి 31న బీజేపీ నేత సత్యకుమార్ పై దాడి కేసులో అనిల్ పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఏ1గా, అనిల్ ఏ2గా ఉన్నారు. కాగా, బోరుగడ్డ అనిల్ కుమార్ ఆగడాలపై బాధితులు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు.