Chandrababu Heart Problem : చంద్రబాబుకు గుండె సమస్య.. బెయిల్ పొడిగింపేనా?

Chandrababu Heart Problem
Chandrababu Heart Problem : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారింది. ఆయనకు కంటి ఆపరేషన్, హెల్త్ కండిషన్ వివరాలు బాబు తరఫు న్యాయవదులు హైకోర్టుకు అందజేశారు. ఆయన ఆరోగ్యం బాగా లేనందున బెయిల్ ను పొడిగించాలని కోరుతున్నారు. బాబు ఆరోగ్యం కోసం కోర్టు వెసులుబాటు కల్పించాలని విజ్ణప్తి చేస్తున్నారు.
ఇప్పటికే చంద్రబాబు కుడి కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. గుండె సంబంధిత సమస్యలతో కూడా బాధపడుతున్నారు. గుండె రక్తనాళాలు బలహీనంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో గుండె పరిమాణం పెరిగిందని వెల్లడిస్తున్నారు. రక్తనాళాల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. చంద్రబాబు అనారోగ్య సమస్యల కారణంతో ఆయనకు ఉన్న ఇబ్బందుల కారణంగా బెయిల్ ను పొడిగించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ఆయనకు ఇప్పటికే మధుమేహం ఉన్నందున దాన్ని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. షుగర్ వల్ల ఇతర సమస్యలు తలెత్తుతాయి. జైల్లో ఉండే ఈ వ్యాధులు చెలరేగి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలో బాబు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి ఆయనకు బెయిల్ పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడిస్తున్నారు.
గతంలో జైల్లో పెట్టినందు వల్ల ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది. ఇప్పుడు మరోమారు జైల్లో పెడితే ఆరోగ్యం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఆయన ఆరోగ్య రీత్యా సహకరించాలని కోరుతున్నారు. దీనిపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. దీంతో లాయర్ల విన్నపంపై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.