Chandrababu Hat : ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు 13న ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతీ రోజు మూడు సభల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 75 ఏళ్ల వయసులోనూ ఎండ, తీవ్ర వడగాడ్పులను కూడా లెక్క చేయకుండా ప్రచారం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వైసీపీ అధినేత, సీఎం జగన్.. బాబును ముసలోడు అయ్యారని హేళన చేస్తున్నా బాబు మాత్రం అలా లేరని అంటున్నారు తెలుగు ప్రజలు. ఈ విషయంలో టీడీపీ క్యాడర్ వైసీపీ అధినేత జగన్ కు గట్టి కౌంటర్ ఇస్తోంది. ఎర్రటి ఎండాకాలం తీవ్రమైన ఎండలోనూ సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు ముసలాడా? లేక సాయంత్రం మాత్రమే సభలు నిర్వహించే జగన్ ముసలాడా? ప్రజలకు తెలుసని సెటైర్లు వేస్తోంది.
వేసవి తాపం తీవ్రంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో 46, 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. చంద్రబాబు తన వయసు రీత్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రచారానికి 10 రోజుల గడువే ఉండడంతో రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆయన సభల్లో ప్రత్యేక టోపీని పెట్టుకొస్తుండడంపై ఆసక్తి నెలకొంది.
నిన్న మొన్నటి వరకు బాబు తలపై కనిపించని టోపీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా.. ఎక్కడ సభలో ప్రసంగించినా.. ఆ టోపీ ఆయన తలపై కనిపిస్తుంది. దీంతో ప్రజలు ఆ టోపీ గురించి ఆరా తీస్తున్నారు.
బాబు పెట్టుకుంటున్న టోపీ చల్లదనాన్ని అందిస్తోందని చెబుతున్నారు. ఉష్ణోగ్రతల భారి నుంచి తలను కాపాడుకునేందుకు కూలింగ్ టోపీ ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఈ టోపీలు కాశ్మీర్ లో తయారవుతాయట. అక్కడి గొర్రెల నుంచి తీసిన నాణ్యమైన ఊలుతో దీన్ని తయారు చేశారట. ఎంత వేసవి తాపం ఉన్నప్పటికీ ఆ ఎండ నుంచి కూలింగ్ టోపీ రక్షణనిస్తుందని చెప్తున్నారు. కాగా ఈ కూలింగ్ టోపీ విలువ రూ. 8 వేల వరకు ఉంటుందట. ఈ టోపీలకున్న ప్రత్యేకతలరీత్యా ధర పెద్ద ఎక్కువేమీ కాదని చెబుతున్నారు.