JAISW News Telugu

CM Chandrababu : అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తూ చంద్రబాబు ఎమోషనల్..

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu :  ఏపీ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రిపై నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. అమరావతికి ఐదేళ్లలో జరిగిన నష్టంపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసి జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు. అలాగే అమరావతిలో ప్రస్తుత పరిస్థితిని కూడా వివరించారు.  రాష్ట్ర విభజన జరుగుతుందని ఎవరూ ఊహించలేదని సీఎం చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ అనుకోలేదన్నారు. అమరావతికి సెంటిమెంట్ ఎక్కువని, పవిత్ర ఆలయాల్లోని మట్టిని తీసుకొచ్చి అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశామని వివరించారు. హైదరాబాద్,  సికింద్రాబాద్ ఆంధ్రప్రదేశ్‌లోని రెండు నగరాలు, అయితే మూడవ నగరం సైబరాబాద్‌ను ఆయన హయాంలో అభివృద్ధి చేశారు. నీళ్లు, కరెంటు లేని రోజుల నుంచి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారన్నారు. హైదరాబాద్‌కు నీళ్ల కోసం కృష్ణా నీటిని తీసుకొచ్చి చరిత్రను తిరగరాశారన్నారు. అలాంటి అనుభవంతోనే అమరావతిని రాజధానిగా చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఏ వైపు చూసినా అమరావతి ప్రాంతం కనిపిస్తోందన్నారు. హైదరాబాద్ లాగే అమరావతి కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.

అమరావతిని రాజధానిగా చేసేందుకు ల్యాండ్ పూలింగ్ మాత్రమే మార్గమని అన్నారు. గతంలో అమరావతి రాజధాని చేస్తానన్న జగన్.. సీఎం కాగానే అమరావతిని పక్కన పెట్టి  మూడు రాజధానుల అంశాన్ని తెచ్చారన్నారు.  అమరావతిని సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేసేందుకు చాలా కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. గుడివాడ, చిలకలూరిపేట వంటి గ్రామాలను కలిపి రాజధాని ప్రాంతానికి ఇచ్చారన్నారు. అమరావతిని స్మార్ట్ సిటీ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే ప్రపంచ స్థాయి ప్రమాణాలు, ఎకనామిక్ పవర్ హౌస్, హైటెక్, నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ ఉద్యోగాలు, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం, ప్రాంతం కలిగి ఉన్న గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించడం, ప్రత్యేక గుర్తింపు, సుస్థిరత, వనరుల సమర్థ నిర్వహణ, ఇవన్నీ అమరావతిలో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకొచ్చి డెవలప్ చేయాలని ప్లాన్ చేసినట్లు వివరించారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలని వీళ్లంతా భావించారు.   అమరావతి అభివృద్ధిలో అసెంబ్లీ, హైకోర్టులతో పాటు హరితహారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అమరావతి అభివృద్ధి ఆగిపోవడంతో అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు.  హైదరాబాద్ నాలెడ్జ్ అకాడమీలోనే 7-10 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఐటీ రంగం సిద్ధమైతే అన్ని రకాల కంపెనీలు వచ్చేవని, వైసీపీ వల్ల అవన్నీ ఆగిపోయాయని అన్నారు.

Exit mobile version