JAISW News Telugu

Chandrababu : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు.. చెత్త పన్ను చెత్త అంటూ వ్యాఖ్యలు..

Chandrababu

Chandrababu

Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో కొన్నేళ్లుగా ఉన్న చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురష్కరించుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతా హి సేవలో సీఎం పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను వసూలు చేయద్దని ఆదేశించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశే ధ్యేయంగా ముందుకెళ్తామన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలని సూచించారు. భవిష్యత్ లో రోడ్లపై చెత్త ఉండద్దని సీఎం అన్నారు.

గాంధీ అహింసతో స్వాతంత్రం సాధించిపెట్టారు. 2014, అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌ పేరిట ప్రధాని మోడీ స్వచ్ఛతకు శ్రీకారం చుట్టారు. దీన్ని తీసుకువచ్చిన ఆయనకు అందరం అభినందనలు చెప్పాలి. నీతి ఆయోగ్‌ కూడా స్వచ్ఛ భారత్‌పై ఉప సంఘం ఏర్పాటు చేసింది. దానికి నేనే చైర్మన్‌. చెత్త నుంచి ఎలా సంపద సృష్టించవచ్చో జాతికి చూపించాను. రూ. 2 లక్షలకు పైగా వ్యక్తి గత మరుగుదొడ్లను నియమించాం. ఏపీని ఓడీఎఫ్‌ రాష్ట్రంగా మార్చాం.

2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వ అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఐదేళ్లలో రోడ్లపై 85 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త కుప్పలుగా పేరుకుంది. ఏడాదిలోగా చెత్త శుభ్రం చేయించాలని పురపాలక శాఖ మంత్రి నారాయణను ఆదేశించాం. స్వచ్ఛ ఏపీ సాధించాలి. 2029 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు.

Exit mobile version