Chandrababu : వైసీపీ రహస్య జీవోలపై చంద్రబాబు కామెంట్.. ఏమన్నారంటే..?
Chandrababu : అధికారం చేతిలో ఉందని అర్థం పర్థం లేని పాలన సాగించడం కాదు. ప్రజల కోసం.. వారి ఆనందం కోసం కష్టపడాలి. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు అక్రమాలకు పాల్పడింది. దీనికి నిదర్శనమే గత ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోవడం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం పాలన పేరుతో ఎన్నో అరాచకాలు, కుంభకోణాలకు పాల్పడింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం జగన్, ఆయన వైసీపీ ప్రభుత్వం చేసిన నీచమైన చర్యలను ఎండగట్టేందుకు సిద్ధమైంది. ఇటీవల చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బూటకపు జీవోలపై విచారణ జరిపిస్తామని చెప్పారు.
ఐదేళ్లుగా జీవోలను దాచిపెట్టారన్నారు. అలాంటిది వారి చీకటి పాలన. పాలనా ఉత్తర్వులు (జీవోలు) జారీ చేసేప్పుడు పారదర్శకంగా ఉండడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. న్యాయస్థానాలు కూడా పారదర్శకత పాటించేందుకు జీవోలే ప్రాథమిక సూత్రాలు అని చెబుతున్నాయి.
గెజిట్ లో జీవోలను ప్రచురించడంతో పాటు వాటిని ఆన్ లైన్ లో కూడా వేయాలని చంద్రబాబు అన్నారు. ‘ఇవి దాచుకోవడానికి మా వ్యక్తిగత ఆస్తులు కావు. ప్రజల కోసం పని చేస్తున్నాం. ఇది ప్రజాపాలన. ప్రజా పాలనలో పారదర్శకత ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఐదేళ్ల జీవోలన్నింటినీ ఆన్ లైన్ లో ప్రచురిస్తామని, కుంభకోణాలకు పాల్పడేందుకు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రహస్య జీవోలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ దౌర్జన్యాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఎండగడతామని, పరిస్థితులను చక్కదిద్దుతామని చంద్రబాబు నాయుడి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది.