Chandrababu Birthday Celebrations : పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

Chandrababu Birthday Celebrations
Chandrababu Birthday Celebrations : పెదకూరపాడు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిడిపి, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వర్ధిల్లాలి, భాష్యం ప్రవీణ్ వర్ధిల్లాలి, టీడీపీ వర్ధిల్లాలి అనే నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అహర్నిశలు ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆలోచించే ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. జన్మదిన ఉత్సవాల్లో పాల్గొన్న వారికి భాష్యం ప్రవీణ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.