JAISW News Telugu

Chandrababu : నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చంద్రబాబు భరోసా

Chandrababu

Chandrababu

Chandrababu : అకాల వడగండ్ల కారణంగా పంట నష్టపోయిన అనంతపురం జిల్లాలో ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. వర్షాల వల్ల నాలుగు జిల్లాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని వారు వివరించారు. దీంతో ప్రభుత్వం తరపున నష్టపోయిన రైతులకు సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, వారిని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Exit mobile version