Chandrababu Cabinet : పవన్ కు పంచాయతీ రాజ్, వంగలపూడికి హోం.. శాఖల కేటాయించిన చంద్రబాబు..
Chandrababu Cabinet : చంద్రబాబు కేబినెట్ కూర్పు శాఖల కేటాయింపుతో పూర్తయ్యింది. ఎవరికి ఏ శాఖ ఇస్తే సరైన న్యాయం జరుగుతుందని అనుకున్న ఆయన అలాగే కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు హోం శాఖ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం పంచాయతీ రాజ్ శాఖను అడిగి మరీ తీసుకున్నారు. ఏపీలో మొదటి సారి డిప్యూటీకి కాకుండా సాధారణ మంత్రికి హోం శాఖ కేటాయించడం. చంద్రబాబుతో పాటు అమిత్ షా కూడా హోం శాఖ తీసుకోవాలని పవన్ ను కోరారు కానీ ఆయన దాని కంటే పంచాయతీ రాజ్ బెస్ట్ అన్నట్లుగా కోరారు. దీంతో ఆయన కోరిక మేరకే చంద్రబాబు పంచాయతీ రాజ్ శాఖను పవన్ కళ్యాణ్ కు అప్పగించారు.
*మంత్రులకు అప్పగించిన శాఖలు ఇవే..*
పేరు కేటాయించిన శాఖ
చంద్రబాబునాయుడు (సీఎం)
-లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజర్, అదర్ పోర్ట్ ఫోలియోస్, మిగిలిన శాఖలు
పవన్ కళ్యాణ్ (డిప్యూటీ సీఎం)
– పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్, రూరల్ వాటర్ సప్లయ్, ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ.
నారా లోకేశ్
– హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్, ఐటీ ఎలక్ట్రానిక్స్, అండ్ కమ్యునికేషన్, ఆర్టీజీ
వంగలపూడి అనిత
– హోం మినిస్టర్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్
అచ్చెన్నాయుడు
– వ్యవసాయం; సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి అభివృద్ధి & మత్స్య
కొల్లు రవీంద్ర
– గనులు & భూగర్భ; అబ్కారీ
నాదెండ్ల మనోహర్
– ఆహార, పౌర సరఫరాలు; వినియోగదారుల వ్యవహారాలు
పీ నారాయాణ
– పురపాలక & పట్టణాభివృద్ధి
సత్యకుమార్ యాదవ్
– ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య
ఎస్ రామానాయుడు
– జలవనరుల అభివృద్ధి
ఎన్ఎమ్ డీ ఫరూక్
– లా & జస్టిస్, మైనారిటీ సంక్షేమం
ఏ రామనారాయణ రెడ్డి
– దేవాదాయ
పయ్యావుల కేషవ్
– ఆర్థిక; ప్రణాళిక; వాణిజ్య పన్నులు & అసెంబ్లీ వ్యవహారాలు
అనగాని సత్యప్రసాద్
– రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్
కొలుసు పార్థ సారధి
– గృహ, సమాచార – పౌరసంబంధాలు
బాల వీరాంజనేయ స్వామి
– సాంఘిక సంక్షేమం; దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం; సచివాలయం & విలేజ్ వలంటీర్
గొట్టిపాటి రవి
– విద్యుత్
కందుల దుర్గేశ్
– పర్యటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ
జీ సంధ్యారాణి
– మహిళా & శిశు సంక్షేమం; గిరిజన సంక్షేమం
బీసీ జనార్దన్ రెడ్డి
– రోడ్లు & భవనాలు; మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
టీజీ భరత్
– పరిశ్రమలు & వాణిజ్యం; ఆహార శుద్ధి
ఎస్ సవిత
– బీసీ సంక్షేమం; ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం; హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్
వాసంశెట్టి సుభాష్
– కార్మిక – కర్మాగార – బాయిలర్స్ & వైద్య బీమా సేవలు
కొండపల్లి శ్రీనివాస్
– ఎంఎస్ఎంఈ; సెర్ప్; ఎన్ఆర్ఐ సాధికారత & సంబంధాలు
ఎం రామ్ ప్రసాద్ రెడ్డి
– రవాణా; యువజన & క్రీడలు