CM Chandrababu : రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. గెలుపు ఓటమిలు సహజం. గెలిచి అధికారం చేపట్టిన ప్రభుత్వం, ఓటమి చెందిన ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సహజం. ఓడిపోయిన ప్రభుత్వం పథకాల పేర్లు తొలగించడం, ఆ ప్రభుత్వం ముద్రించిన ఫోటోలు, బొమ్మలను తీసివేయడం సహజంగా చూస్తుంటాం. ఓటమిపాలైన ప్రభుత్వం పథకాలకు పెట్టిన పేర్లు, ఫోటో ల ఆనవాళ్లు ఎక్కడ కూడా కనబడకుండా చేసి కక్ష తీర్చుకుంటారు నాయకులు. కానీ చంద్రబాబు నాయుడు కూడ అధికారం చేపట్టగానే జగన్ పథకాలపై విరుచుకుపడుతారని తెలుగు దేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ పార్టీల నాయకులు ఊహించారు. వాళ్ళతో పాటు వైసీపీ నేతలు కూడా అదే నిజమవుతుందని కలగన్నారు.
గడిచిన ఐదేళ్లల్లో వైసీపీ నేతలు చేసిన పాప, పుణ్యాలను ఏ మాత్రం మనసులో పెట్టుకోలేదు. పసిపిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే పాఠ్య పుస్తకాలపై మాజీ సీఎం జగన్ బొమ్మ ముద్రించి ఉంది. ఆ బొమ్మను తొలగించడానికి చంద్రబాబు నాయుడికి జగన్ పై ఉన్న పగను తీర్చుకోలేదు. జగన్ బొమ్మ ఉంటె ఇబ్బంది ఏమిలేదు. ఉండనివ్వండి. అనవసరంగా పని పెట్టుకున్నట్టు. బొమ్మను తొలగిస్తే వచ్చేది అంటూ ఏమిలేదు. అంటూ తాజా సీఎం చంద్రబాబు నాయడు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశం అయ్యిది. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం రాజకీయపరంగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పరంగా ఆరోగ్యకరమైనదా ?. అనారోగ్యకరమైనదా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇది ఏవిదంగా ఆలోచించిన ఆరోగ్యకర మైనదేననే అభిప్రాయాలు రాష్ట్రంలో సర్వత్రా వ్యక్తం కావడం విశేషం.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎవరిపై కక్ష సాధింపు చర్యలు ఉండవని తాజా సీఎం చంద్రబాబు నాయుడు ముందే ప్రజల సమక్షంలో ప్రకటించారు. కేవలం ప్రజలు అభివృద్దిపైననే దృష్టి పెడుతామని స్పష్టం చేశారు . ఇప్పుడు అదేవిదంగా బాబు పరిపాలనలో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఖర్చులు తగ్గించుకొని, రాష్ట్రాన్ని అప్పుల నుంచి గట్టెకించడానికే అయన తన పరిపాలనపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం అమలు చేసిన విద్యా కనుక పేరును మాత్రమే మార్చారు.
స్టూడెంట్ కిట్ గా మార్చారు. కానీ విద్యార్థుల స్టేషనరీ వస్తువులపై ఉన్న జగన్ బొమ్మను మాత్రం తొలగించలేదు. ఇప్పుడు ఆ బొమ్మ తొలగించడం, తిరిగి తయారు చేసిన సంస్థలకు పంపడం, జగన్ బొమ్మ స్థానంలో మరో బొమ్మ ముద్రించడం, తిరిగి పాఠశాలలకు సరఫరా చేయడం అదనపు ఖర్చుతో కూడుకున్న పని. అందుకనే చంద్రబాబు నాయుడు కక్షలకు అవకాశం ఇవ్వకుండా, ఖర్చులు తగ్గించుకోడానికే ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.