JAISW News Telugu

Akhilesh – Chandrababu : కలవరం కలిగిస్తున్న చంద్రబాబు, అఖిలేష్ ఫొటో

Akhilesh - Chandrababu

Akhilesh Yadav – Chandrababu

Akhilesh – Chandrababu : లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు భారత రాజకీయాల్లో అత్యంత డిమాండ్ ఉన్న వ్యక్తిగా నిలిచాడు. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 272 మ్యాజిక్ ఫిగర్ కంటే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి తక్కువ సీట్లు ఉన్నాయి. దీంతో ఎన్డీయే భాగస్వామ్యమైన టీడీపీ మద్దతు కావాల్సి ఉంది. ఇక, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండీ) కూటమికి కూడా తాము మరింత బలోపేతం కావాలంటే చంద్రబాబు మద్దతు కావాలి ఈ నేపథ్యంలో రెండు పార్టీలు పోటీ బాబును ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి.

సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో చంద్రబాబు నాయుడు కలిసి ఉన్న ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చంద్రబాబు నాయుడు ఇండీ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారనే ఊహాగానాలు బీజేపీ మద్దతుదారుల్లో ఆందోళనలు రేకెత్తించాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటోలు 2019 లక్నోలో అఖిలేష్ యాదవ్ ను కలిసిన సమయంలో తీసినవని స్పష్టం అవుతుంది. దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుత చర్చలకు ఈ ఫొటోలకు సంబంధం లేదు.

‘మోదీజీ, ఇది పాత ఫొటో’ అంటూ అఖిలేశ్, చంద్రబాబు నాయుడు కలిసి దిగిన ఫొటోను కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ షేర్ చేసింది. సోషల్ మీడియా కాంగ్రెస్ రహస్య అస్త్రంగా మారిందనే చెప్పాలి. ద్వేషంతో నిండిన కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ తో బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి చౌకబారు ప్రచారం చేస్తుందని పలువురు నవ్వుకుంటున్నారు.

అయితే, నిన్న (జూన్ 6) జరిగిన ఎన్డీయే కీలక సమావేశంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇప్పటి వరకైతే చంద్రబాబు ఎన్డీయేతోనే ఉన్నాడు. మోడీ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నాడు. ఇక ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది వేచి చూడాలి.

Exit mobile version