Chanakya Niti :చాణక్య నీతి: ఆలుమగల బంధం బలపడాలంటే ఏం చేయాలో తెలుసా?
Chanakya Niti : కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. భార్యాభర్తల బంధంలో ఎన్నో సమస్యలుంటాయి. వాటిని తట్టుకుని నిలబడితేనే మన పెళ్లికి సార్థకత ఉంటుంది. అంతేకాని చీటికి మాటికి గొడవలకు పోతే ఆ బంధం కాస్త అగమ్యగోచరంగా మారుతుంది. భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అన్ని అవసరాలు తీర్చాలి అది మగవాడిగా మన బాధ్యత. భార్య కూడా మనం చెప్పినట్లు వినాలి. అది ఆవిడ ధర్మం.
ఆచార్య చాణక్యుడు భార్యాభర్తల బంధం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించిన వారికి మేలే జరిగింది. అతడు సూచించిన ప్రకారం నడుచుకుంటే గొడవలు ఉండనే ఉండవు. అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా నిలవచ్చు. పాశ్చాత్యులు కూడా మన వివాహ వ్యవస్థను గౌరవించడానికి కారణం అందులో ఉన్న గొప్పతనమే అని తెలుసుకోవాలి.
భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఆలుమగల బంధం బలపడాలంటే ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగాలి. అనురాగం వెళ్లివిరియాలి. ఒకరిపై మరొకరికి పరస్పర అనుబంధం పెరిగితే ఇద్దరి బంధం పది కాలాల పాటు వర్ధిల్లుతుంది. దీంతో వారు మంచి భార్యాభర్తలుగా కీర్తించబడతారు. సమాజంలో మంచి పేరు తీసుకొచ్చుకుంటారు.
ఆలుమగలు గొప్పలకు పోవద్దు. లేనిదాన్ని ఉన్నట్లు డాంబకాలు కొట్టకూడదు. ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటే అంత అర్థం ఉండదు. మన ఖ్యాతిని ఇతరులు గుర్తించాలి. కానీ మనమే డప్పు కొట్టుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్య అహం పెరుగుతుంది. నేనే గొప్ప అంటే నేనే పెద్ద అనే అభిప్రాయాలు వస్తాయి. అందుకే మొగుడు పెళ్లాం గొప్పలకు పోకూడదని చాణక్యుడి సూచన.
సహనంతో వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితులోనైనా కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలి. కోపంలో మాటలు కంట్రోల్ తప్పి ఎక్కడికో దారి తీస్తాయి. ఒక దశలో భార్యాభర్తలు విడిపోవడానికి కారణం కూడా ఈ కోపమే. భార్యాభర్తల బంధాన్ని కాపాడుకోవాలంటే కోపం దరిచేరకుండా చూసుకోవడమే మంచిది. ఇలా చాణక్యుడు చెప్పిన సత్యాలను పాటించడం వల్ల మన వివాహం జీవితకాలం నిలబడుతుందని గుర్తించుకోవాలి.
భార్యాభర్తల వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు. ఇది కూడా ఆలుమగల బంధాన్ని పాడు చేస్తుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం పోతుంది. కుటుంబ విషయాలు బయట పంచుకోకపోవడమే మంచిదనే విషయం గ్రహించుకోవాలి. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో భార్యాభర్తల బంధం కోసం చాలా విషయాలు తెలియజేశాడు.