
Chaitanya Krishna is Nandamuri’s hero in Bigg Boss 8 Telugu
Bigg Boss 8 telugu : అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే హేమాహేమీలు లాంటి వారిని ఈ సీజన్ లో ఎంపిక చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అందులో కుమారీ ఆంటీ లాంటి సామాన్యురాలు కూడా ఉందని అంటున్నారు. మంచి మసాలా కంటెంట్ అందించేందుకు ఈసారి పెద్ద ప్లాన్ చేసినట్టు సమాచారం.
కాంట్రవర్సీ ఎక్కువగా ఉండాలని ఈసారి బిగ్ బాస్ లోకి వేణుస్వామి లాంటి వివాదాస్పద జ్యోతిష్యుడిని కూడా ఎంపిక చేశారని అంటున్నారు. ఇక అందరికంటే కూడా మరో ఫైర్ బాంబు నందమూరి నటసింహం ను కూడా ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.
నందమూరి హీరో చైతన్య కృష్ణ కొన్నిసినిమాల్లో మెరిసినా అవి హిట్ టాక్ అందుకోలేదు. కానీ టీడీపీ తరుఫున ఈయన బలంగా వాయిస్ వినిపించేవాడు. చాలా ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఇలాంటి నందమూరి హీరో చైతన్యకృష్ణను బిగ్ బాస్ బరిలో నింపారని లేటెస్ట్ అప్టేట్. దీంతో హౌస్ మొత్తం గొడవలతో నింపడానికి ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం.