Chadalavada Nagarani : పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన చదలవాడ నాగరాణి

Chadalavada Nagarani
Chadalavada Nagarani : పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా చదలవాడ నాగరాణి బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ఆమెను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమించారు. చదలవాడ నాగరాణి భర్త ఐపీఎస్ చదలవాడ ఉమేష్ చంద్ర అందరికీ సుపరిచితమైనవారు. ఆయనను హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో మావోయిస్టులు హత్య చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ కుటుంబానికి అండగా నిలుస్తానని మాట ఇచ్చారు.
ఆ తర్వాత ఉమేష్ చంద్ర భార్య నాగరాణికి డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలిచ్చారు. బీబబీఎం చదివిన నాగరాణి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా వచ్చారు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నారు. నాగరాణి పుట్టినిల్లు తూర్పు గోదావరి జిల్లా కావడం విశేషం. పొరుగు జిల్లా పశ్చిమ గోదావరికి ఆమె కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు.