Non-caste and non-religion : తమ నాలుగేళ్ల కుమార్తెకు ఏ కులం, మతంతో సంబంధం లేదని పేర్కొంటూ ‘నో క్యాస్ట్, నో రిలీజియన్’ సర్టిఫికెట్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన నరేష్ కార్తిక్, గాయత్రి దంపతులు. తమ కుమార్తెకు ఏ కులం, మతంతో సంబంధం లేదని పేర్కొంటూ ‘నో క్యాస్ట్, నో రిలీజియన్’ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ సర్టిఫికెట్ తీసుకుంటే రిజర్వేషన్లు, ఇతర ప్రభుత్వ సదుపాయాలు అండవని తెలిసినప్పటికీ, తమ బిడ్డకు ప్రేమ, సమానత్వం నేర్పించాలని భావించి కుల ధ్రువీకరణ పత్రం పొందేందుకు ఇష్టపడలేదు. తమ కూతురు విల్మా(4)కు స్కూల్‌లో అడ్మిషన్ సమయంలో కులం, మతం సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. దీంతో వారు దరఖాస్తు చేసుకుని అధికారుల నుంచి పొందారు. వీరి పై సోషల్ మీడియాలో పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.