Covid-19:పెరుగుతున్న కోవిడ్ కేసులు…రాష్ట్రాల‌ను హెచ్చ‌రించిన కేంద్రం

Covid-19:దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో కోవిడ్ -19 కేసులు పెర‌గ‌డం, కేర‌ళ‌లో కొత్తగా స‌బ్ వేరియంట్ వెలుగు చూసిన నేప‌థ్యంలో కేంద్రం అల‌ర్ట్ అయింది. రాష్ట్రాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. క‌రోనా స‌మ‌యంలో తీసుకున్న జాగ్ర‌త్త‌లు మ‌రోసారి తీసుకోవాల‌ని అన్ని రాష్ట్రాల‌ను హెచ్చ‌రిస్తూ తాజా అడ్వైజ‌రీ జారీ చేసింది.

రానున్న పండ‌గ‌ల సీజ‌న్‌లో వైర‌స్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు ముమ్మ‌రంగా చేప‌ట్టాల‌ని సూచించింది. ఇన్‌ఫ్ల‌యెంజా త‌ర‌హా కేసుల‌ను జిల్లా స్థాయిలోనే న‌మోదు చేసి వాటిపై ప‌ర్య‌వేక్ష‌ణ ఉంచాల‌ని తెలిపింది. క‌రోనా కొత్త స‌బ్ వేరియంట్ జెఎన్. 1 కేసులు ఇటీవ‌ల కేర‌ళ‌లో వెలుగు చూసిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ భార‌త్ స‌హా 38 దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించిన‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని రాష్ట్రాల‌ను హెచ్చ‌రించింది.

అప్ర‌మ‌త్తంగా ఉంటూ కొత్త కేసుల‌పై నిఘా ఉంచాల‌ని ఆదేశించింది. ఆర్‌టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ సంఖ్య‌లో చేయాల‌ని, వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాల‌ని సూచించింది. వృద్ధులు, రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్నవాళ్ల ప‌ట్ల మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తాజా అడ్వైజ‌రీలో కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్ర‌న‌భుత్వ‌, ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో సంసిద్ధ‌త‌ల‌ను ప‌రీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య‌శాఖ చేప‌డుతున్న మాక్ డ్రిల్స్‌లో భాగ‌స్వామ్యం కావాల‌ని సూచించింది.

TAGS