AP loan : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అన్ని వైపుల నుంచి వేగంగా తీసుకెళ్తున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎన్డీయేలో కీ పార్టీ అయిన టీడీపీ తమ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్రం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ డెవలప్ మెంట్ కు కోట్లాది రూపాయల నిధులు తీసుకువస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ నిధులతో ఐదేళ్లలో ఏపీని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలని పథక రచన చేస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు సంబంధించి కేంద్రం ఇస్తానన్న డబ్బును ఇప్పటికే ఇచ్చింది. వీటితో చాలా కార్యక్రమాలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. తాజాగా మరింత డబ్బు కవాలని కోరింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి దఫా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అయితే 2014 కాలంలో కేంద్రంతో నెలకొన్ని వివాదాల కారణంగా కేంద్రం పట్టించుకోలేదు. ఆ తర్వాత జగన్ సీఎం అయినా కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. ఇక 2024లో ఎన్టీయే భాగస్వామి అయిన టీడీపీ ఎంపీ సీట్లు కీలకంగా మారాయి. దీంతో కేంద్రం అడిగినంత రుణాలను ఇస్తుంది.
ఏపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు కేంద్రం హామీ ఇచ్చిన రూ.47,000 కోట్ల రుణ పరిమితి సెప్టెంబర్ లో ముగిసిపోయింది. కొత్తగా అక్టోబర్-డిసెంబర్ మధ్య మరో రూ. 7,000 కోట్ల అప్పు కవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్రం సైతం ఓకే చెప్పింది. ఇది అడ్వాన్స్ మాత్రమేనని, మిగిలింది ఖరారు చేయాల్సి ఉందని పేర్కొంది. కాగా ఈ ఆర్ధిక సంవత్సరంలో సెక్యూరిటీల వేలం ద్వారా ప్రభుత్వం రూ. 50,000 కోట్ల అప్పు చేసింది.