CM Revanth : గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా ఉండేది.. ఇది ఏదో ఎన్నికలప్పుడో అనుకుంటే పొరబాటే.. ఏకంగా పాలన మొత్తం ఇలానే సాగింది. మొదటి సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక (2014) మొదటి ప్రథమార్ధంలో కేంద్రానికి సపోర్ట్ చేశాడు. ఎక్కడ చెడిందో తెలియదు కానీ.. చాలా కాలం పాటు కేంద్రానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. మోడీని కేసీఆర్ చాలా సందర్భాల్లో పరుషమైన పదజాలంతో నిందించాడు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదని మొత్తం గుజరాత్ కే ఇస్తుందని ఆరోపణలు చేశారు.
ఇక, జీఎస్టీ సమావేశాల నుంచి సీఎంల మీటింగ్ ల వరకు ఢిల్లీకి వెళ్లేందుకు కేసీఆర్ నిరాకరిస్తూనే వచ్చారు. అది ఎంతలా మారిందంటే జనవరి 26, ఆగస్ట్ 15న ఎర్రకోట వద్ద జరిగే శకటాల ప్రదర్శనల్లో తెలంగాణ శకటంను పంపించకపోవడం వరకు వెళ్లింది. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కూడా పంపించేది కాదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. ప్రతీ విషయాన్ని కేసీఆర్ రాజకీయ కోణంలోనే చూస్తుండడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపణలు కూడా వచ్చాయి. భారత ప్రజాస్వామ్యం ప్రకారం.. రాష్ట్రాల విషయంలో కేంద్రం తల్లి పాత్రను పోషిస్తుంది. చాలా వరకు తల్లి చేతిలోనే పాలన ఉంటుంది. అన్ని విషయాలు తెలిసిన కేసీఆర్ కేంద్రంతో ఎందుకు దూరంగా ఉన్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సరే ఇప్పుడు ఇది పక్కన పెడితే..
తెలంగాణ నెల బాలుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం మత్రం వేశాడో గానీ ప్రధాని ఆయన కోరిన వరాలు గుప్పించారట. వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చిన మోడీ రాష్ట్ర సమస్యలను సావధానంగా విన్నారట. కేంద్ర సహకారం ఉంటుందని హామీ ఇచ్చారట. గత ముఖ్యమంత్రి తనకు రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించలేదని.. మీలా నిధులు, అవసరాలను కోరలేదని పీఎం చెప్పారట. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయి కానీ.. డెవలప్ విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని సీఎంతో అన్నారట.
ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను సీఎం కలిశారు. హైదరాబాద్ లోని రక్షణ భూముల బదాలయింపును వివరించారు. దీనికి ఆయన కూడా పచ్చ జెండా ఊపారట. దీంతో కంటోన్మెంట్ డెవలప్ అవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సితా రామన్ ను కలిసి నిధుల కేటాయించాలని కోరగా ఆమె సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనితో పాటు రుణాలకు సంబంధించి కొన్ని వెసులుబాటులు కూడా కల్పించారట. ఐపీఎస్ లు కావాలని కోరగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వేంటనే కొంత మందిని కేటాయించారని పూర్తిగా త్వరలో వస్తారని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి సారి ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఈ విషయాలను వెల్లడించారు.