TDP : టీడీపీలోకి ఈ ఇద్దరికే కేంద్ర కేబినెట్ బెర్తులు!

TDP

TDP

TDP : కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (ఎన్డీయే) ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఫలితాల తర్వాతి రోజు జరిగిన మీటింగ్ లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు పాల్గొన్నాయి. ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు అందరం సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాతి రోజు జరిగిన సమావేశంలో తర్వాతి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని మరోసారి ఎన్నుకున్నారు. జూన్ 9 (ఆదివారం)న ప్రధాని ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీతో పాటు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ, జేడీ(యూ)లకు కేంద్ర కేబినెట్ లో చోటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీకి నాలుగు, జేడీ(యూ)కు 2 కేబినెట్ మంత్రులు ఇస్తారని ప్రచారం జరగుతోంది. తాజాగా టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు కేటాయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రుల పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఇందులో రామ్మోహన్‌ నాయుడికి కేబినెట్‌ హోదా అయితే పెమ్మసానికి సహాయమంత్రి పదవి ఖరారు చేసినట్లు ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

మోడీ కేబినెట్‌లో టీడీపీలోని ఇద్దరు ఎంపీలకు కేంద్ర పదవులు ఖరారైనట్లు సమాచారం. టీడీపీ నాలుగు బెర్త్ లను కోరినట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. 2 కేబినెట్, 2 సహాయక పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు లోక్ సభ స్పీకర్ కోసం కూడా కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

రామ్మోహన్ నాయుడి గురించి..
కింజరాపు ఎర్రన్నాయుడు మరణాంతరం 2012లో రాజకీయాల్లోకి వచ్చారు రామ్మోహన్ నాయుడు (37). ఎర్రన్నాయుడు 1996-98 మధ్య కాలంలో ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ కేబినెట్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. రామ్మోహన్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మంచి వాక్ చాతుర్యం కలిగిన వ్యక్తి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడగలరు. వీటి కారణంగానే టీడీపీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

పెమ్మసాని గురించి..
కేంద్రంలో మరో పదవి దక్కించుకోబోతున్నారు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. పెమ్మసానికి ఎన్నారై పెట్టుబడిదారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది రాష్ట్రానికి పెట్టు బడులు తీసుకురావడంలో తోడ్పడుతుందని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ టీడీపీకి లోక్ సభ స్పీకర్ ఇస్తారనుకుంటే లోక్‌ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు, జీఎం హరీష్ బాలయోగి పేరును బాబు సిఫార్సు చేయచ్చని తెలుస్తోంది. రాష్ట్రపతి ఆదివారం రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్‌ కోర్ట్‌లో ప్రధాని, కేబినెట్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

TAGS