Bhupathiraju Srinivasavarma : పోలవరానికి అవసరమైన నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆదివారం ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలన్నది పీఎం మోదీ, సీఎం చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. చక్కగా పనిచేసే పోలవరం నిర్మాణ సంస్థను గత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని అన్నారు. రూ.70 వేల కోట్ల బీపీసీఎల్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. భద్రాచలం-కొవ్వూరు రైలు మార్గం విషయమై ఆ శాఖ మంత్రితో మాట్లడతానని భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు.