Celebrities : తెలంగాణలో ఓటు వినియోగించుకున్న ప్రముఖులు

Celebrities Vote, Venkaiah Naidu Vote
Celebrities Vote in Telangana : తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుండగా పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి పాఠశాలలో ఓటు వేశారు.
సినీనటుడు ఎన్టీఆర్ ఇదే పోలింగ్ కేంద్రంలో భార్య లక్ష్మిప్రణతితో కలిసి వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లో సినీనటుడు చిరంజీవి ఓటు వేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మాదాపూర్ లో, బర్కత్ పురాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఫిలింనగర్ లో సినీనటుడు అల్లు అర్జున్, మలక్ పేటలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మేడ్చల్ మండలం పూడూరులో బీజేపీ నేత ఈటల రాజేందర్, నానక్ రామ్ గూడలో నటుడు నరేష్, కుందన్ బాగ్ లో జయేశ్ రంజన్, జూబ్లీ హిల్స్ లో సినీ దర్శకుడు తేజ, తార్నాకలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఓటుహక్కు వినియోగించుకున్నారు.