CM Jagan : సీసీ కెమెరాలను తాకట్టు పెట్టి మరీ..! ఇలాంటివి అన్నీ జగన్ కే చెల్లుతాయా?
CM Jagan : వైసీపీ ప్రభుత్వంపై రోజు రోజుకు ఆరోపణలు తీవ్రం అవుతున్నాయి. మూడు రాజధానుల అంశం నుంచి ప్రతీ ఒక్క వివాదంలో వైసీపీ ప్రభుత్వం ఇన్నాల్వ్ అవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధాని నగరమైన అమరావతిలో ఇప్పటికే భూములను తాకట్టు పెట్టి కోట్లాది రూపాయల అప్పు తెచ్చాడని జగన్ ప్రభుత్వంపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.
ఇప్పుడు మరో భారీ తాకట్టుకు తెరలేపినట్లు సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. భూములను తాకట్టు పెడితే బాగానే ఉంటుంది. స్థలం అనేది ఎక్కడికి వెళ్లేది కాదు కాబట్టి తాకట్టు పెట్టినా నడుస్తుంది. కానీ ఏపీలో వింత ఆచారానికి తెరలేపింది జగన్ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీసీ కెమెరాలను తాకట్టు పెట్టి మరీ వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చిందట. పైగా తెచ్చిన అప్పుకు జరిమానాలు కూడా కడుతుందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై అటు ప్రతిపక్షాలతో పాటు ఏపీ ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు. జగన్ ప్రభుత్వం రాను రాను తమకు తెలియకుండా తమ తలను కూడా తాకట్టు పెడుతుందా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.