Land Titles Act : తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతున్నారు . గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న కేసరపల్లి ప్రధాన వేదికయినది. జూన్ 12న ఉదయం 12.17 గంటలకు ముహూర్తం ఖరారు అయ్యింది. మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. అదేరోజు సాధ్యమైనంతవరకు కొత్త మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించడానికి కూడా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. జగన్ ను ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు బీజేపీ తో జత కట్టారు.
కూటమి నుంచి 164 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం ఆశతో ఉన్నారు. మంత్రి వర్గం ఏర్పాటు చంద్రబాబుకు కత్తి మీది సాములా తయారైనది. ఐదేళ్ల తరువాత అధికారంలోకి వెళ్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. చంద్రబాబు ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటి సంతకం ఏ హామీ ఫైల్ పై చేయబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా నిలిచింది. దాని తరువాత రెండో సంతకం కూడా ఏ హామీ ఫైల్ పై పెట్టనున్నారనేది కూడా రాజకీయ వర్గాలతో పాటు పార్టీ వర్గాల్లో కూడా చర్చకు తెరలేచింది.
జగన్ మోహన్ రెడ్డి రైతుల భూములను ఆక్రమించుకోడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకు వచ్చాడని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ భూ పట్టాదారుల చట్టం పట్ల మీరంతా అజాగ్రత్తగా ఉండాలని రైతులను ఉద్దేశించి తన ప్రసంగంలో హెచ్చరించారు. రైతు పాసు పుస్తకాలపై కూడా జగన్ బొమ్మ ముద్రించి పంపిణి చేశారు. ఈ అంశాన్ని కూడా చంద్రబాబు ప్రచారంలో ప్రస్తావించారు.
అక్కడితో ఆగకుండా తాను అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేసేవిదంగా రెండో సంతకాన్ని దానికి సంబందించిన ఫైల్ పై చేస్తానని కూడా హామీ ఇచ్చారు. అందుకు తగిన విదంగా చంద్రబాబు అధికారం చేపట్టగానే ప్రజల సమక్షములో రెండో సంతకం చేయబోతున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఇదే జరిగితే ఏపీ మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏరికోరి చట్టాన్ని తాయారు చేయించుకొని రైతుల పాసు పుస్తకాలపై వేసుకొన్న తన బొమ్మ చెరిగిపోవడం ఖాయం.