JAISW News Telugu

DK Shivakumar : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సిబిఐ నోటీసులు

karnataka deputy cm DK Shivakumar

DK Shivakumar : సీబీఐ నోటీసు పై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేరళకు చెందిన ఓ టీవీ ఛానెల్‌  సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసింది. తనను హింసించి రాజకీయం గా అంతం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని డీకే ఆరోపించారు.

 

రాష్ట్రాలల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రత్యర్థులు నాపై ఇలా కక్ష సాధిం పు చర్యలకు పాల్పడుతున్నారని డీకే శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.  డీకే శివకుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక వ్యక్తిగా వ్యవహరి స్తున్నాడు. తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంచార్జిగా కూడా డీకే ను కాంగ్రెస్అధిష్టానం నియమించింది.ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా గతంలో పర్యటించారు.

సొంత రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా డీకే శివకుమార్ ఆక్టివ్ కావడంతో ప్రత్యర్థుల కన్ను డీకే పై పడింది.  తినే పద్యంలోని సిబిఐ ద్వారా కేసులు నమోదు చేసి ఇబ్బంది పెట్టాలని కొందరు రాజకీయ నేతలు భావిస్తున్నా రని డీకే తెలిపారు. దేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎన్ని కుట్రలు చేసిన నన్ను ఎవరు ఏమి చేయలేరని డికె శివకుమార్ భీమా వ్యక్తం చేశారు.

Exit mobile version