Viral Video : మెడిసిన్ క్యాప్స్యూల్స్ విషయంలో అప్రమత్తత అవసరం..
Viral Video : అప్రమత్తత అనేది అవసరం లేదంటే చిక్కుల్లో ఇరుక్కోవడం ఖాయం అంటారు పెద్దలు. బయటి నుంచి ఏదైనా కొనుగోలు చేస్తే దాని గురించి పరిశీలించారు. ఆ తర్వాతనే వాడాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని అందించే మెడిసిన్స్ విషయంలో మరింత జాగ్రత్త అవసరం అసలు వేసుకుంటుంది ఏంటి? అందులో ఏముంది లాంటివి చూసుకోవాలి లేదంటే అరోగ్యం మాట దేవుడెరుగు.. అనారోగ్యం భారిన మరిన్ని చిక్కులు కొని తెచ్చుకుంటారు.
ఇక్కడ వీడియోలో చూడండి.. క్యాప్స్యూల్స్ లలో మొలలు, ఇనుప వస్తువులను ఉంచారు. ఇది డాక్టర్ సూచించారని మనం కొని వాడితే రోగం నయమవదు సరికదా ఇందులో ఉన్న మొలలు, ఇనుప వస్తువులు కడుపులో చేరి కొత్త రోగం వస్తుంది. అయితే క్యాప్స్యూల్స్ వాడేవారు విప్పి చూడలేరు అలా చూస్తే ఆ మెడిసిన్ ప్రభావం కోల్పోతుందని వైద్యులు చెప్తారు. కాబట్టి ఒక సారి ఊపితే అందులో మెడిసిన్ ఉందో? ఇంకేమైనా వస్తువులు ఉన్నాయో తెలుస్తుంది అని కొందరు చెప్తున్నారు.