Heroine Sanjana : క్యాస్టింగ్ కౌచ్ : తనకు జరిగిన విషయాన్ని బయటపెట్టి సంచలనం రేపిన హీరోయిన్ సంజనా..
Heroine Sanjana : టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ కామనే అని చాలా మంది నటులు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇస్తున్నామంటే చాలు ఇది ఎదుర్కోక తప్పదట. ఏ నటీమణైనా ఇది ఎదుర్కొన్న తర్వాతే వెండితెరపై కనిపిస్తారు. అయితే ఇందులో స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు, దర్శకుల వారసులకు మాత్రం ఇది వర్తించదు. అయితే క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం హీరోయిన్లకే కాదు.. హీరోలకు కూడా అని ఇటీవల కొందరు స్టార్ మేల్ నటులు చెప్పాడం వింతగా అనిపించింది.
క్యాస్టింగ్ కౌచ్ గురించి అప్ కమింగ్ హీరోయిన్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సంజనా అన్నా తన ఇబ్బందులను చెప్పుకచ్చింది. మోడలింగ్ మొదలుపెట్టి సినిమాల్లో పాత్రలు వెతుక్కుంటున్న సమయంలో ఓ దర్శకుడు ఆమెను ఓ మీటింగ్ కోసం తనను సంప్రదించాడట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పిన ఆమె సదరు డైరెక్టర్ పేరును మాత్రం చెప్పలేదు. అతని గురించి చెప్తే ఆయనకున్న ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు తన కుటుంబం, పిల్లలు తీవ్రంగా అవమానాలకు గురవుతారని అందుకే చెప్పనని చెప్పింది.
ఆమెలాగా చాలా మంది బాధతులు క్యాస్టింగ్ కౌచ్ వేధింపులను ఎదుర్కొంటున్నారు. వారంతా తమను ఇబ్బంది పెట్టిన వారి పేర్లను చెప్పకుంటే క్యాస్టింగ్ కౌచ్ మరింత వేళ్లూనుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతటి ఫేమస్ పర్సన్ అయినా ఒకరికి శిక్షపడితేనే మరొకరికి బుద్ధి వస్తుందని అంటున్నారు.
సంజనా లాగా భయపడుతూ సైలెంట్ గా ఉండిపోతే వారు మరింత పెట్రేగిపోయి ఇతరులను క్యాస్టింగ్ కౌచ్ కు బలిచేస్తూనే ఉంటారు. జవాబుదారీతనానికి భయపడకుండా క్యాస్టింగ్ కౌచ్ లాంటివి చేయడంలో ఇది వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇలాంటి మనస్తత్వం సినీ పరిశ్రమలో రాబోయే అనేక మంది ప్రతిభావంతులను దోపిడీకి తెరతీస్తుంది.