JAISW News Telugu

Mumbai actress : ముంబై నటి కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా

Mumbai actress

Mumbai actress

Mumbai actress : ముంబై నటి కేసులో ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే కేసులో సినీనటి ఇంప్లీడ్ అయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను నవంబరు 26కు వాయిదా వేసింది. అప్పటి వరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ముంబై నటి కాదంబరి జెత్వాని వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ముంబై నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో తీసుకొచ్చి.. ఒక గెస్ట్ హౌస్ లో ఉంచి మరీ వేధించారు. ముంబై నటి కాదంబరి జెత్వానీ వేధింపుల వ్యవహారంలో పలువురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల ప్రమేయం ఉన్న విషయం తెలిసిందే.

Exit mobile version