Sajjala : టీడీపీ కార్యాలయంపై దాడి కేసు. మంగళగిరి పీఎస్ లో విచారణకు హాజరైన సజ్జల

Sajjala
Sajjala Rama Krisha Reddy : ఏపీలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సజ్జల 120వ నిందితుడిగా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని రెండు రోజుల క్రితం మంగళగిరి పోలీసులు సజ్జలకు నోటీసులు అందజేశారు. గురువారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సజ్జల వెంట న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు బ్రహ్మారెడ్డి, అప్పిరెడ్డిలు ఉన్నారు. అయితే, విచారణ సమయంలో న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. దీనికి కోర్టు అనుమతి తప్పనిసరి అని, ప్రస్తుతం విచారణకు సజ్జలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీంతో సజ్జల ఒక్కరే పోలీస్ స్టేషన్ లోకి వెళ్లారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, రూరల్ సీఐ శ్రీనివాసరావు విచారిస్తున్నారు.