TDP office : టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. ప్రధాన నిందితుడి రిమాండ్ పొడిగింపు

TDP office
TDP office attack main accused : టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడికి న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఈ ఘటనలో ఏ1గా ఉన్న పానుగంటి చైతన్యకు కోర్టు మరో 14 రోజుల రిమాండ్ పొడిగించింది. మూడు రోజుల సీఐడీ కస్టడీ ముగియడంతో అధికారులు సోమవారం గుంటూరులోని 6వ అదనపు న్యాయస్థానం ఎదుట నిందితుడిని హాజరుపరిచారు. మూడు రోజుల కస్టడీలో అధికారుల ప్రశ్నలకు చైతన్య స్పందించలేదని, ప్రశ్నలన్నింటికీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానే సమాధానాలిచ్చాడని, విచారణకు సహకరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం చైతన్యకు మరో రెండు వారాలు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయనను కోర్టు నుంచి విజయవాడ జైలుకు తరలించారు.